News22nd Apr 12:39 PMSunil Byrisetty1 min read

ఇక దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు!

దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుంది. బొగ్గు రైళ్ల తర్వాత ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక నుంచి హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది.

ఇక దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు!
దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుంది. బొగ్గు రైళ్ల తర్వాత ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక నుంచి హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ రైలు జూలై నుంచి హరియాణాలోని జీంద్ జిల్లాలో జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. రీసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్‌ సంస్థ తొలి హైడ్రోజన్‌ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ ఇన్నోవేషన్‌ కింద హైడ్రోజన్‌ పవర్‌తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది. హెరిటేజ్‌, హిల్‌స్టేషన్స్‌ రూట్స్‌లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హైడ్రోజన్‌తో నడిచే రైలు నిర్మాణ పనులు చెన్నైలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 40 వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించుకోనుంది. ఒకసారి ట్యాంక్‌ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు.
Indias First Hydrogen Train
Haryana
Heritage
Hill Stations
హైడ్రోజన్‌తో నడిచే రైలు
హైడ్రోజన్‌ పవర్‌
హరియాణాలోని జీంద్ జిల్లాలో జీంద్ నుంచి సోనిపత్
Scroll for the next article