Business Type19th Sep 10:53 AMSunil Byrisetty1 min read

ఏపీలో జొన్నగిరి బంగారు గని నుంచి ఉత్పత్తి!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు పంట పండుతోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక

ఏపీలో జొన్నగిరి బంగారు గని నుంచి ఉత్పత్తి!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు పంట పండుతోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు. తమ అంచనాల ప్రకారం జొన్నగిరి గని నుంచి తొలినాళ్లలో ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. రానున్న రెండు, మూడేళ్లలో ఈ ఉత్పత్తిని 1,000 కిలోల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Kurnool
Jonnagiri
Gold Mine
Deccan Gold Mines
Gold Production
Indian Mining
Private Sector
Economy
హనుమ ప్రసాద్
బంగారు గనులు
Scroll for the next article