News28th May 04:08 PMSunil Byrisetty1 min read
కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ
దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL)లు సంయుక్తంగా కర్ణాటకలోన
దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL)లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. మొదట 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్లు తయారవుతాయి. ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను స్థాపిస్తున్న నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నేతృత్వంలోని హెలికాప్టర్ తయారీ యూనిట్ అవుతుంది.