News18th Nov 10:35 AMSunil Byrisetty1 min read
విశాఖలో పొడవైన గ్లాస్ బ్రిడ్జి!
విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (వంతెన) భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్లు పొడవు
విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (వంతెన) భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్లు పొడవు ఉంది. ఇది కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ (38 మీటర్లు) కంటే ఎక్కువ. కైలాసగిరి హిల్స్ వద్ద టైటానిక్ వ్యూపాయింట్ దగ్గర ఇది ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 862 అడుగులు (262 మీటర్లు) ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంది. మూడు పొరల40 మిమీ మందం కలిగిన టెంపర్డ్ లామినేటెడ్ జర్మన్ గ్లాస్ ప్యానెల్స్‌తో నిర్మించారు. 40 టన్నుల స్టీల్ సపోర్ట్ ఉంది. బ్రిడ్జి 500 కిలోల భారాన్ని మీటరుకు తట్టుకోగలదు. 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలికి కూడా సురక్షితంగా ఉంటుంది. ఒకేసారి 40 మంది సందర్శకులు మాత్రమే బ్రిడ్జిపైకి వెళ్లవచ్చు. ఎంట్రీ రూ. 250తో ఉన్న ఈ విశాఖపట్నం గ్లాస్ బ్రిడ్జ్ ప్రస్తుతం పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది.