International6th Sep 12:22 PMSunil Byrisetty1 min read
భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం
భారత్-అమెరికా మధ్య టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు దేశాలు కొన్
భారత్-అమెరికా మధ్య టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయన్నారు. తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో మోదీ గొప్ప ప్రధాని. నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సానుకూల సంబంధాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.