News4th Sep 04:06 PMSunil Byrisetty1 min read
స్వదేశీ ‘కామికేజ్’కు మరో బలం
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (డీపీఎస్‌యూ) అయిన *మ్య
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (డీపీఎస్‌యూ) అయిన *మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)*తో డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసే మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణపై రెండు సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంపై ద్రోగో ఏరోస్పేస్ నుంచి డ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు ,ఎం ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ పూణే లో సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో డ్రోగో ఏరోస్పేస్ యూఏవీ ప్లాట్‌ఫామ్ రూపకల్పన, అభివృద్ధి, తయారీతో పాటు సంబంధిత ఖాళీ పేలోడ్ హార్డ్‌వేర్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మరోవైపు ఎంఐఎల్ తనకు ఉన్న రక్షణ మందుగుండు సామగ్రి, వార్‌హెడ్ సాంకేతికతలోని నైపుణ్యాన్ని అందించనుంది.