News14th Aug 02:53 PMSunil Byrisetty1 min read

గన్నవరం నుంచి వారణాసికి ఇండిగో సర్వీసు

వారణాసికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విమానం నడపనున్నారు. ఇండిగో సంస్థ ఈ నూతన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు ర

గన్నవరం నుంచి వారణాసికి ఇండిగో సర్వీసు
వారణాసికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విమానం నడపనున్నారు. ఇండిగో సంస్థ ఈ నూతన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా ఈ సర్వీసును ప్రారంభించారు. వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళ, గురు, శనివారాల్లో నడవనున్నాయి. వారణాసికి వెళ్లడానికి ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్ వచ్చేది. ఇప్పుడు ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు మరింత సౌకర్యం కలగనుంది. అలాగే ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతం కలగనుంది. అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలకు ఈ సర్వీసు ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు టైర్‌-2, టైర్‌-3 నగరాలను ప్రధాన విమానాశ్రయాలతో అనుసంధానించడం జరగనుంది.
Andhra Pradesh
IndiGo
Gannavaram Airport
Vijayawada Airport
Varanasi Flights
Vijayawada–Varanasi Flight
Ram Mohan Naidu
Civil Aviation
విమాన కనెక్టివిటీ
ఆధ్యాత్మిక పర్యాటకం
ఆంధ్రప్రదేశ్
వారణాసి
అమరావతి
Scroll for the next article