News15th Nov 11:41 AMSunil Byrisetty1 min read
గన్నవరం నుంచి సింగపూర్ కు ఇండిగో సర్వీసులు
గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్ల తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సింగపూర్ కు సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఇకపై వయబులిటి గ్
గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్ల తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సింగపూర్ కు సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఇకపై వయబులిటి గ్యాప్ ఫండింగ్ లేకుండానే వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం సింగపూర్ కు సర్వీసులు నడపనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో నేటి నుంచి గన్నవరం నుంచి సింగపూర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.