News28th Jul 11:51 AMSunil Byrisetty1 min read
సుప్రీంకోర్టులో ప్రత్యేక కేసు.. సెక్స్ సమ్మతిపై విచారణ!
సుప్రీంకోర్టులో ఒక ప్రత్యేక కేసు విచారణకు వచ్చింది. పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర
సుప్రీంకోర్టులో ఒక ప్రత్యేక కేసు విచారణకు వచ్చింది. పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి చేశారు. పోక్సో చట్టం 2012, ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 16-18 ఏళ్ల వయసులో ఉన్నవారి లైంగిక కార్యకలాపాలను పూర్తిగా నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఆమె వాదనలు వినిపించారు. ప్రస్తుత చట్టం పరస్పర సమ్మతితో పెట్టుకునే సంబంధాలను నేరంగా పరిగణిస్తుందని తెలిపారు. ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే చాలా పోక్సో కేసు ఫిర్యాదులను బాధితులు కాకుండా, వారి తల్లిదండ్రులే చేశారని ఇందిరా జైసింగ్ తెలిపారు. ఏకాభిప్రాయ లైంగికతను నేరంగా పరిగణించడం యువ జంటలను బహిరంగ చర్చలు, విద్యకు దూరం చేయడమేనని అభిప్రాయపడ్డారు.