Spiritual21st Aug 11:33 AMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై రోజుకు 10 వేల భక్తులకు అన్నప్రసాదం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అన్నదానానికి మరింత ఆధునిక రూపు రానుంది. భవిష్యత్తులో భక్తుల సంఖ్యకు అనుగుణంగా పెద్దఎత్తున అన్నప్రసాదం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అన్నదానానికి మరింత ఆధునిక రూపు రానుంది. భవిష్యత్తులో భక్తుల సంఖ్యకు అనుగుణంగా పెద్దఎత్తున అన్నప్రసాదం సిద్ధం చేసేందుకు రోజుకు 10 వేల మందికి భోజనం అందించే సామర్థ్యంతో ఆధునిక యాంత్రిక అన్నదాన కేంద్ర వంటశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ (అక్షయపాత్ర ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఈ ఆవిరి ఆధారిత యాంత్రిక వంటశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.1.95 కోట్లను వెచ్చించేందుకు, టెండర్లు నిర్వహించకుండా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వంటశాల పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందనున్నాయి.