News13th Nov 06:24 PMSunil Byrisetty1 min read

నాడు వద్దన్న పరిశ్రమలన్నీ.. నేడు ఏపీకి!

రాష్ట్రం నుంచి వెళ్లిన పరిశ్రమలు వెనక్కి వస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఏపీ పెద్ద మొత్తంలో ఎంవోయులు కుదుర్చుకుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తి

నాడు వద్దన్న పరిశ్రమలన్నీ.. నేడు ఏపీకి!
రాష్ట్రం నుంచి వెళ్లిన పరిశ్రమలు వెనక్కి వస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఏపీ పెద్ద మొత్తంలో ఎంవోయులు కుదుర్చుకుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. సీఐఐ సమ్మిట్‌కు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యూ పవర్ సంస్థతో రూ. 82 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఒప్పందంలో భాగంగా ఈడీబీతో రూ. 60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంవోయూలను రెన్యూ పవర్ సంస్థ కుదుర్చుకుంది. అదే సమయంలో ఏపీలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గతంలోనే రెన్యూ పవర్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో మొత్తం ఒప్పందాల విలువ రూ. 82 వేల కోట్లకు చేరుకుంది. ఏపీలో పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పందంలో భాగంగా 6 గిగావాట్ల పీవీ ఇం‌గోట్-వేఫర్ ప్లాంట్, 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 గిగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టులను రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటు చేయనుంది.
Andhra Pradesh
CII 2025
Investment Summit
Renewable Energy
ReNew Power
Green Energy
Solar Power
Hydro Energy
chandra babu naidu
బ్యాటరీ స్టోరేజ్
గ్రీన్ అమ్మోనియా
పరిశ్రమల అభివృద్ధి
Scroll for the next article