Electronics7th Jul 02:04 PMSunil Byrisetty1 min read
తొలిసారి ల్యాప్‌టాప్ తెచ్చిన ఇన్‌ఫినిక్స్
మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ దేశీయంగా తొలిసారి రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. అందులో భాగంగా ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇటీవల విడుదలయ్యాయి. Infinix
మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ దేశీయంగా తొలిసారి రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. అందులో భాగంగా ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇటీవల విడుదలయ్యాయి. Infinix Inbook X1, Infinix Inbook X1 Pro పేరిట లాంచ్ అయ్యాయి. ఇన్‌ఫినిక్స్ ఎక్స్1 ల్యాప్‌టాప్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో, ధర రూ.35,999గా ఉంది. ఇంటెల్ కోర్ ఐ5 (10th Gen Intel Core i5) ప్రాసెసర్‌తో ఉన్న వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లు ఆరా గ్రీన్, నోబెల్ రెడ్, స్టార్‌ఫాల్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో నడుస్తుండగా.. దీని ధర రూ.55,999గా ఉంది. ఈ మోడల్స్ అల్యూమినియం ఫినిష్ మెటర్ బాడీతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే కేవలం 1.48 కేజీల బరువు ఉండి ప్రీమియమ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే డ్యుయల్ టోన్ ఫినిష్ కలర్ సూపర్‌గా కనిపిస్తుంది.
ఇక పోర్టుల విషయానికి వస్తే ఓ హెచ్‌డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, ఓ యూఎస్‌బీ 3.0 పోర్టు, ఓ 3.5 ఎంఎం ఆడియా జాక్, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, ఎస్‌డీ కార్డు రీడర్ ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. అలాగే కెమెరా, మైక్రోఫోన్‌లను ఆన్, ఆఫ్ చేసేందుకు ఈ ల్యాప్‌టాప్‌కు హార్డ్ వేర్ స్విచ్చులు ఉండటం మరో ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.