Mobiles21st Jun 04:04 PMSunil Byrisetty1 min read

ఈ స్మార్ట్ ఫోన్ సుగంధభరితం.. సెంట్‌తో పనిలేనట్లే!

Infinix కొత్తగా NOTE 50s 5G+ సిరీస్‌లో మరింత అందుబాటు ధరలో సరికొత్త 6GB RAM వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లో ప్రత్యేకంగా Marine Drift Blue కలర్ వేరియంట్‌లో వీ

ఈ స్మార్ట్ ఫోన్ సుగంధభరితం.. సెంట్‌తో పనిలేనట్లే!
Infinix కొత్తగా NOTE 50s 5G+ సిరీస్‌లో మరింత అందుబాటు ధరలో సరికొత్త 6GB RAM వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లో ప్రత్యేకంగా Marine Drift Blue కలర్ వేరియంట్‌లో వీగన్ లెదర్‌తో పాటు “మైక్రోఎన్‌క్యాప్సులేషన్” టెక్నాలజీని వాడారు. దీనివల్ల ఫోన్ సముద్రపు గాలి, నిమ్మ, పూల సువాసనల మిశ్రమాన్ని వెదజల్లుతుంది. ఇది మార్కెట్‌లో మరే ఫోన్‌లోనూ లేని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్ కింద పడినా పగలదనే మిలటరీ గ్రేడ్ పటిష్ఠత MIL-STD-810H సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఇంకా గొరిల్లా గ్లాస్ 5 స్క్రీన్‌పై గీతలు పడకుండా రక్షణ ఇస్తుంది. MediaTek Dimensity 7300 Ultimate చిప్‌సెట్ మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్మార్ట్ AI ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూబీ రెడ్, టైటానియం గ్రే, ప్రత్యేకమైన మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
Smart mobiles
OS Android 15
Infinix Note 50s 5G+
Microencapsulation Technology
rear panel with a fragrance
Scroll for the next article