News13th Oct 03:49 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ కాంగ్రెస్ వర్

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి కొలనుకొండ శివాజి, మీసాల రాజేశ్వర రావు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశం కేవలం మొక్కుబడిగా జరిగిన సమావేశంగా తమకు అనిపించిందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలను అనుసరించకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డులను కనీసం 90 రోజులపాటు భద్రపరచాలని కోరినట్లు వెల్లడించారు.
Scroll for the next article