National15th Jun 01:06 PMSunil Byrisetty1 min read

ఎయిరిండియా విమానాల్లో తనిఖీలు!

అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ అలర్టైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్‌లో నేలకూలి 250 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నేప

ఎయిరిండియా విమానాల్లో తనిఖీలు!
అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ అలర్టైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్‌లో నేలకూలి 250 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిరిండియా విమానాలను సమగ్రంగా పరిశీలించాలని కేంద్రం ఆదేశించింది. DGCA ఆదేశాలతో ఎయిరిండియా తనిఖీలు చేపట్టింది. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై స్పెషల్ ఆడిట్ నిర్వహించనుంది. అలాగే భద్రతా ప్రమాణాలపై DGCA నివేదిక కోరింది.
India news
air india
Air India Ahmedabad plane crash
Inspections on Air India flights
ఎయిరిండియా విమానాల్లో తనిఖీలు
Scroll for the next article