News26th Mar 08:34 AMSunil Byrisetty1 min read
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్ఫూర్తితో ఎరుపెక్కిన మదురై
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌షర్ట్స్ వలంటీర్లు కదం తొక్కారు. స్వతంత్ర పోరాటయోధులు, యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌షర్ట్స్ వలంటీర్లు కదం తొక్కారు.
స్వతంత్ర పోరాటయోధులు, యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్ఫూర్తితో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ అఖిల భారత మహాసభ ఏప్రిల్ 2 నుంచి 6 వరకు మదురైలో నిర్వహిస్తోంది.
ఈ మహాసభలో సందర్భంగా చేపట్టబోయే రెడ్ షర్ట్స్ బ్రిగేడ్ ర్యాలీకి సన్నాహంగా తమిళనాడు వ్యాప్తంగా రిహార్సల్స్ నిర్వహించారు.
మదురైలోని తముకం మైదానం (కామ్రేడ్ సీతారాం ఏచూరి నగరం)లో నిర్వహించే మహాసభకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న రెడ్‌షర్ట్స్ వలంటీర్ల ర్యాలీ ఏప్రిల్ 6న సాయంత్రం 3 గంటలకు తెప్పకుళం సమీపంలో ప్రారంభమవుతుంది. భారత విప్లవ పోరాటాల్లో ఒకటిగా నిలిచిన వాచతీ పోరాట యోధులు ఈ పరేడ్‌ను ప్రారంభించనున్నారు.
తమిళనాడు వ్యాప్తంగా ఎంపిక చేసిన 25 వేల మంది రెడ్‌షర్ట్స్ వలంటీర్లు ఈ కవాతులో పాల్గొంటారు. శ్రామికవర్గ పోరాట యోధుల యూనిఫాం అయిన ఖాకీ, ఎరుపు దుస్తులు ధరించి ఎర్రజెండాల వెలుగులతో సాగే ఈ కవాతుతో మదురై నగరం ప్రజ్వలిల్లనుంది. ఈ మహా కవాతు కోసం పోరాట స్ఫూర్తి ప్రదాతలు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి రోజు అయిన గత ఆదివారం తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ రిహార్సల్స్ నిర్వహించారు.