News15th Oct 11:43 AMSunil Byrisetty1 min read

ఇన్‌స్టాగ్రామ్‌లో రూల్స్ మరింత కఠినం

ఇన్‌స్టాగ్రామ్‌లో రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయి. మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం కీలక మార్పులు చేసింది. ఇకపై 13 ఏళ్ల లోపు వారు చూసే కంటెంట్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో రూల్స్ మరింత కఠినం
ఇన్‌స్టాగ్రామ్‌లో రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయి. మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం కీలక మార్పులు చేసింది. ఇకపై 13 ఏళ్ల లోపు వారు చూసే కంటెంట్‌కు మాత్రమే పరిమితం చేస్తామని, లైంగిక, హింసాత్మక, ప్రమాదకరమైన కంటెంట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. టీనేజర్ల ఖాతాలు ఆటోమేటిక్‌గా '13+ సెట్టింగ్'లోకి మారతాయని, ఈ సెట్టింగ్‌ను మార్చాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని వివరించింది. ఈ మార్పులు టీనేజర్లను హానికరమైన కంటెంట్ నుంచి రక్షించేందుకు ఉద్దేశించబడ్డాయని మెటా తెలిపింది.
Instagram
Social Media
Meta
Teen Safety
Content Restrictions
Online Safety
Digital Wellness
Parental Control
Social Media Updates
Teen Protection
Scroll for the next article