News15th Apr 06:04 PMSunil Byrisetty1 min read
ఏపీ ప్రభుత్వం ప్లాన్.. విద్యుత్ చార్జీలు సగానికి!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ చార్జీలను గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాలపై (రూఫ్లైప్) 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ చార్జీలను గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకోసం ప్రభుత్వ కార్యాలయాలపై (రూఫ్లైప్) 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పంద వ్యవధిలో సుమారు రూ.2,957కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్తు కోసం యూనిట్‌కు సగటున రూ.6-8 వరకు చెల్లించాల్సి వస్తోంది.
సౌర విద్యుత్ వాడితే ఈ మొత్తం సగానికి సగం తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు.