News9th May 01:00 PMSunil Byrisetty1 min read
14న శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ఫ్రతిష్టా మహోత్సవం
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈనెల 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈనెల 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ, జీవధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతిష్టా అధ్వర్యులు రొంపిచర్ల వెంకట సత్యనారాయణా చార్యులు(అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, టీటీడీ) ఆధ్వర్యంలో స్వామి
వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు. పూజాది కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 10, 11, 12,13వ తేదీల్లో పూజలు, హోమాలు, తీర్థప్రసాద సంతర్పణ తదితరాలు జరుగుతాయి. 14న ఐదు గంటలకు సుప్రభాతం మంగళవాద్యయుత దేవోత్ధాపన, విష్వక్సేనారాధనం, పుణ్యాహం, ప్రాతస్సవనం, రత్నన్యాస, దాతున్యాస, యంత్ర స్థాపన, ఉదయం 6:40లకు శ్రీ స్వామి వారు ద్వారా పాలక, ఒంటె వాహన, జీవ, ద్వజ, విమాన శిఖరాది పీఠారోహణం, పీఠ బంధనం, కళాన్యాసం, ప్రధమార్చన మహర్షి వేదన, ద్వష్టి కుంభం, ధేను దర్శనం, కన్యా బ్రహ్మణ నవధ్యాన దర్శనం, శ్రీ స్వామివారి దివ్య మంగళ విగ్రహ దర్శనం, ఆచార్య సన్మానం మహా పూర్ణాహుతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.