News22nd Apr 06:00 PMSunil Byrisetty1 min read

న్యాయవ్యవస్థపై నిత్యం దాడులే.. సుప్రీంకోర్టు జస్టిస్ షాకింగ్!

దేశంలో న్యాయవ్యవస్థపై నిత్యం దాడులు జరుగుతున్నాయని భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండి

న్యాయవ్యవస్థపై నిత్యం దాడులే.. సుప్రీంకోర్టు జస్టిస్ షాకింగ్!
దేశంలో న్యాయవ్యవస్థపై నిత్యం దాడులు జరుగుతున్నాయని భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాలపై బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, బీజేపీ ఎంపీ నిశికాంత్ ధూబే సుప్రీం కోర్టు నిర్ణయంపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జస్టిస్ సూర్య కాంత్ తామేమీ బాధపడటం లేదని, ప్రతీ రోజు న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ సైతం ఓ కేసు విషయంలో మాట్లాడుతూ "శాసన,కార్యనిర్వహక వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటున్నామని మేము ఆరోపణలు ఎదుర్కొంటున్నామ"న్నారు.
New Delhi
Jagdeep Dhankhar
BJP MP Nishikant Dubey
Justice Surya Kant
న్యాయవ్యవస్థపై నిత్యం దాడులే
. సుప్రీంకోర్టు జస్టిస్
Scroll for the next article