News27th Jan 01:00 PMSunil Byrisetty1 min read

ఫిబ్రవరి 10 వరకు ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వేను కొనసాగిస్తోంది. డిసెంబర్‌లో ఈ సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చే

ఫిబ్రవరి 10 వరకు ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వేను కొనసాగిస్తోంది. డిసెంబర్‌లో ఈ సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినా సర్వే ఇంకా పూర్తి కాలేదు. టెక్నికల్ కారణాల వల్ల సర్వే ఆలస్యమవుతోంది. దీంతో గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వే ద్వారా ఏపీలోని ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ సర్వే చేపడుతుండగా.. గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. సర్వేలో ఇంటింటికి వెళ్లి 20 రకాల అంశాలపై సమాచారం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
Andhra Pradesh Government
Integrated Family Survey
Comprehensive Household Survey
Survey Deadline Extended
కుటుంబ వివరాల నమోదు
టెక్నికల్ సమస్యలు
గ్రామీణ ప్రాంతాలు
ప్రభుత్వ సంక్షేమ
Scroll for the next article