Education13th Mar 11:32 AMSunil Byrisetty1 min read
చదువుల తల్లిని విధి వంచించింది
చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తోంది. అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తోంది. ఇంటర్మీడియల్ మొదటి ఏడాదిలోనూ 425 మార్కులతో సత్తా చాటింది. కానీ ఆ చదువుల తల్లిని విధ
చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తోంది. అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తోంది.
ఇంటర్మీడియల్ మొదటి ఏడాదిలోనూ 425 మార్కులతో సత్తా చాటింది. కానీ ఆ చదువుల తల్లిని విధి వంచించింది.
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్ష రాస్తుండగా మృత్యువు ఒడిలోకి చేర్చింది.
కడపకు చెందిన ఆయేషా మహీం షేక్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో ఏడాది చదువుతోంది.
కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయేషా.... బుధవారం పరీక్ష రాస్తుండగా... ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.
వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.