News1st Dec 05:02 PMSunil Byrisetty1 min read

అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

మదనపల్లి కేంద్రంగా "డిజిటల్ అరెస్ట్" పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. 75 ఏళ్ల రిటై

అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్
మదనపల్లి కేంద్రంగా "డిజిటల్ అరెస్ట్" పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న నిందితులు, సీబీఐ/ఈడీ అధికారులమంటూ బెదిరించి, "మీ మీద కేసు ఉంది" అంటూ భయపెట్టారు. "డిజిటల్ అరెస్ట్" పేరుతో వీడియో కాల్‌లో ఉంచి, రూ.48 లక్షలు బదిలీ చేయించుకున్నారు. రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులు పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా, ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా కాంబోడియా, కువైట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. "డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఏం లేదు. ఎవరూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. ఏ దర్యాప్తు సంస్థా ఆన్‌లైన్‌లో డబ్బులు అడగదు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చిన వెంటనే 1930 కు కాల్ చేయాలి" అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు.
AP Police
Digital Arrest Scam
International Cyber Gang
Madanapalle
SP Dheeraj Kunubilli
Cyber Crime
Online Fraud
Senior Citizen Fraud
Cambodia Network
Kuwait Network
India Cyber Security
Scroll for the next article