News16th Oct 05:49 PMSunil Byrisetty1 min read
ఈసీఆర్‌ఎఫ్ పనులు భేష్.. నిర్మాణం బాగుంది!
“ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్” (చాలా బాగుంది.. పనులు చక్కగా సాగుతున్నాయి).. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను
“ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్” (చాలా బాగుంది.. పనులు చక్కగా సాగుతున్నాయి).. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్యలివి. డ్యామ్‌లోని గ్యాప్-2 ప్రాంతంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో మట్టి తేమ శాతం, గట్టిదనాన్ని పరిశీలించిన నిపుణులు.. ఇప్పటివరకు జరిగిన పనులపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రాజెక్టులో వివిధ నిర్మాణ పనులను పరిశీలిస్తూ, సమీక్షల్లో పాల్గొంటున్న అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ పాల్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్ వోహ్రా, సభ్య కార్యదర్శి ఎం. రఘురాం తదితరులతో కలిసి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌లో ఇప్పటివరకు చేపట్టిన మట్టి, రాయి, ఇసుక పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులు నిపుణులకు వివరించారు. ప్రధానంగా మట్టి తేమ శాతం, కుదింపు తర్వాత దాని గట్టిదనం ఏ మేరకు ఉందన్న అంశాలపై నిపుణులు దృష్టి సారించారు. వారి సూచనల మేరకు నిర్మాణ సంస్థ సిబ్బంది రెండు ప్రాంతాల్లో నిర్దేశిత కొలతలతో పెద్ద గుంతలు (పిట్స్) తవ్వారు. వాటిలోకి దిగిన నిపుణులు మట్టిని స్వయంగా పరిశీలించారు.