News14th Oct 05:10 PMSunil Byrisetty1 min read

పోలవరం ప్రాజెక్ట్ లో అంతర్జాతీయ నిపుణుల పర్యటన

పోలవరం ప్రాజెక్ట్ లో అంతర్జాతీయ నిపుణుల పర్యటించారు. ఇప్పటికే ఏడు విడతలు ప్రాజెక్ట్ ను సందర్శించిన విదేశీ నిపుణులు, నేటి నుంచి ఎనిమిదో విడత పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పర

పోలవరం ప్రాజెక్ట్ లో అంతర్జాతీయ నిపుణుల పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ లో అంతర్జాతీయ నిపుణుల పర్యటించారు. ఇప్పటికే ఏడు విడతలు ప్రాజెక్ట్ ను సందర్శించిన విదేశీ నిపుణులు, నేటి నుంచి ఎనిమిదో విడత పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. విదేశీ నిపుణులతో పాటు పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం, సి ఎస్ ఎం ఆర్ ఎస్, వ్యాప్కోస్ అధికారులు పాల్గొంటున్నారు. ప్రాజెక్ట్ లో క్షేత్ర స్థాయి పర్యటనకు ముందు విదేశీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈఎన్సి కె నరసింహమూర్తి, ఎస్ఈ పీ రామచంద్రరావు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్ పనులు జరుగుతున్న తీరును వివరించారు.
Scroll for the next article