Life Style3rd Aug 09:46 AMSunil Byrisetty1 min read
నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం*
స్నేహబంధం ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలలో గొప్పది. తల్లిదండ్రులతో కలిసి పంచుకోలేని పలు విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. కష్ట సుఖాలను తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం. జీవితంలో
స్నేహబంధం ప్రపంచంలో ఉన్న గొప్ప బంధాలలో గొప్పది. తల్లిదండ్రులతో కలిసి పంచుకోలేని పలు విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. కష్ట సుఖాలను తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం. జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరే ఉంటారు. ఆ ఫ్రెండ్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అదే నిజమైన స్నేహం. ప్రతీ ఏటా స్నేహితుల దినోత్సవంగా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని జరుపుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో జూలై 30న నిర్వహించుకుంటారు. 20 శతాబ్దం ప్రారంభంలో హాల్ మార్క్ అనే వ్యక్తి ఈరోజును స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తరువాత 2011 లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఫ్రెండ్సిఫ్ డేను ప్రకటించిది. అప్పటి నుంచి కొన్నిదేశాలు జూలై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవాలని మనదేశంలో నిర్ణయించారు.