News1st Jun 08:59 AMSunil Byrisetty1 min read
నిడమర్రులో అంతర్జాతీయ స్థాయి మోడల్ స్కూల్
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ కాన్సెప్ట్ తో రాజధాని మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ను రాష్ట్రంలొనే తొలి మోడల్ స్కూల్ గా ఎంపిక చేశారు. నిడమర్రులో అంతర్జ
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ కాన్సెప్ట్ తో రాజధాని మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పి హైస్కూల్ ను రాష్ట్రంలొనే తొలి మోడల్ స్కూల్ గా ఎంపిక చేశారు. నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ కు ఆంకురార్పణ జరిగింది. సుమారు 15 కోట్ల రూపాయలతో నిడమర్రు జెడ్పి హైస్కూల్ ప్రాంగణంలో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఆధునికత జోడించి, ఆధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అగస్త్య ఫౌండషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్ & పార్క్ నిర్మాణం జరుగనుంది. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ మార్క్ చూపిస్తూ ఆయన ఆధ్వర్యంలో అభివృద్ది పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.