News5th Mar 01:32 PMSunil Byrisetty1 min read

మహిళా దినోత్సవం విజయవంతం చేయండి

మహిళా దినోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపుడి అనిత, ఎస్ సవితతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కా

మహిళా దినోత్సవం విజయవంతం చేయండి
మహిళా దినోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపుడి అనిత, ఎస్ సవితతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు క్రమశిక్షణతో పకడ్బందీగా మహిళా దినోత్సవం నిర్వహించాలని స్పష్టం చేశారు. స్త్రీ,శిశు,గిరిజన,బీసీ,చేనేత,హోం శాఖ తదితర శాఖలకు చెందిన డైరెక్టర్లు,ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేసి, కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.
women's day
Andhra Pradesh
International
మహిళా దినోత్సవ
గుమ్మిడి సంధ్యారాణి
వంగలపుడి అనిత
Scroll for the next article