News20th May 01:08 PMSunil Byrisetty1 min read

2 కోట్ల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.వ

2 కోట్ల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం
జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాల్లో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (ఎస్పిఎంజి),అన్ని కోర్టు కాంప్లెక్సుల్లో మరుగు దొడ్లు నిర్మాణం తదితర అంశాలపై ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 2 కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
Visakhapatnam
International Yoga Day
Chandra babu
Pm Modi
రామకృష్ణ బీచ్‌
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగా దినోత్సవ కార్యక్రమాల్లో కనీసం 2 కోట్ల మంది
Scroll for the next article