Politics3rd Sep 05:28 PMSunil Byrisetty1 min read

కోటికి చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు

కోటికి చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం 39వ రోజూ విజయవంతంగా కొనసాగింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 1,32,987 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించడంతో మొత్తం సందర్శనలు 99.85 లక్షలకు చేరుకున్నాయి. దీంతో కార్యక్రమం కోటి ఇళ్ల మైలురాయికి చేరువైంది. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
Andhra Pradesh politics
Intintiki Telugu Desam
Intintiki Telugu Desam 2026
TDP
Telugu Desam Party
AP Coalition Government
TDP Leaders
Door to Door Campaign
అభివృద్ధి కార్యక్రమాలు
ప్రజా సమస్యలు
కోటి ఇళ్లు
టీడీపీ వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article