News15th Nov 04:45 PMSunil Byrisetty1 min read
పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ
సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి
సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 10,690 రూమ్స్ ఏర్పాటు అవుతాయన్నారు. ప్రత్యక్షంగా 34,406, పరోక్షంగా 63,470 మొత్తంగా 97,876 మందికి పర్యాటక, అతిథ్య రంగాల్లో ఉపాధి లభిస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సమ్మిట్ లో చేసుకున్న దాదాపు రూ.6,500 కోట్ల విలువైన ఎంవోయూలలో థీమ్ పార్కులు, మెరీనాలు, ఫిల్మ్ సిటీలు, వెల్ నెస్ సెంటర్లు, రోడ్డు పక్కన సౌకర్యాలు, క్రూయిజ్‌లు, అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాలపై దృష్టిసారిస్తామన్నారు. తొలిసారిగా రూ.1,860 కోట్ల విలువైన పర్యాటక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు తద్వారా 12,500 ఉద్యోగాలు వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తల భారీ స్పందనతో పర్యాటక రంగంలో నూతనోత్తేజం వచ్చిందన్నారు.