News17th Nov 04:15 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు, లోకేష్ విజన్ ఫలితంగానే ఏపీకి పెట్టుబడులు
విశాఖ సీఐఐ సమ్మిట్ మూడు రోజుల పాటు దిగ్విజయంగా సాగి, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదని శానసమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నార
విశాఖ సీఐఐ సమ్మిట్ మూడు రోజుల పాటు దిగ్విజయంగా సాగి, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదని శానసమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో 17 నెలల్లో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. విశాఖ సమ్మిట్ లో ఏకంగా 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని,
దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించిందని తెలిపారు. దీనికి హర్షించాల్సింది పోయి వైసీపీ దొంగల ముఠా, చంచల గూడ జైలు పార్టీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. పరిశ్రమలకు కావాల్సిన నీటి వసతి, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి అనేక సౌకర్యాలను కల్పిస్తామని వారికి భరోసా కల్పించడంతోనే నేడు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని పేర్కొన్నారు. జగన్ హయాంలో మాదిరి పరిస్థితి ఉండదని పారిశ్రామిక వేత్తలకు హామీ ఇవ్వడంతోనే చంద్రబాబు, లోకేష్ లను నమ్మి మాత్రమే ఏపీకి పరిశ్రమలు వచ్చాయని అనురాధ అన్నారు.