News17th Sep 12:03 PMSunil Byrisetty1 min read

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాలకు సీఎం దంపతులు హాజరు కానున్నారు.
Tirumala
TTD
Srivari Brahmotsavams
Chandrababu Naidu
Tirupati Temple
Hindu Festivals
Spiritual Events
Andhra Pradesh
Devotees
Temple Celebrations
Religious Traditions
CM Invitation
ధార్మిక సంప్రదాయాలు
బ్రహ్మోత్సవ ఆహ్వానం
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Scroll for the next article