Mobiles22nd May 05:49 PMSunil Byrisetty1 min read
ఐఫోన్ 16 ప్లస్‌పై డిస్కౌంట్.. ఏకంగా రూ. 11,600 తగ్గింపు
కొత్త ఐఫోన్ 16 ప్లస్ కొనాలని చూస్తున్నారా? అదీ డిస్కౌంట్ ధరలో. అయితే ఈ వార్త మీకోసమే. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌ల
కొత్త ఐఫోన్ 16 ప్లస్ కొనాలని చూస్తున్నారా? అదీ డిస్కౌంట్ ధరలో.
అయితే ఈ వార్త మీకోసమే. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ ఆఫర్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుత ఈ ఆఫర్‌తో రూ. 11,600 వరకు తగ్గింపు పొందవచ్చు.
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది.
ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫోన్ రూ. 82,300కు లిస్టు అయింది.
ఐఫోన్ 16 ప్లస్‌పై రూ. 7,600 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. పిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లన్నింటికి సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 16 ప్లస్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.