Mobiles15th Jun 05:05 PMSunil Byrisetty1 min read

ఐఫోన్ 17 సిరీస్.. మతిపోయే ఫీచర్లు!

ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరు. చాలామంది ఐఫోన్‌ను పర్సనల్‌ ఎమోషన్‌గా తీసుకుంటారు. వారికి యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఐఫోన్ 17 సిరీస్ 4 మోడల్స్ తేబోతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీ

ఐఫోన్ 17 సిరీస్.. మతిపోయే ఫీచర్లు!
ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరు. చాలామంది ఐఫోన్‌ను పర్సనల్‌ ఎమోషన్‌గా తీసుకుంటారు. వారికి యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఐఫోన్ 17 సిరీస్ 4 మోడల్స్ తేబోతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో బేస్ మోడల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో లాంచ్ కాబోయే ఈ లైనప్ ఫోన్లు కొత్త టారిఫ్ ఛార్జీల కారణంగా ధరలు కొంత పెరగవచ్చు. గత కొన్నేళ్ల ట్రెండ్స్ ప్రకారం.. ఐఫోన్ 17 రూ. 89,900, ఐఫోన్ 17 ఎయిర్ రూ. 99,900 నుంచి ప్రారంభం కావచ్చు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర వరుసగా రూ. 1,39,900, రూ. 1,64,900గా ఉండవచ్చని అంచనా. USB-C పోర్ట్, యాక్షన్ బటన్‌తో బేసిక్ మోడల్, డిజైన్ పిక్సెల్ ఫోన్ మాదిరి రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ బ్యాక్ సైడ్ ప్రో వేరియంట్లు కలిగి ఉంటాయి. OLED డిస్‌ప్లేతో, 24MP సెన్సార్ అప్‌గ్రేడ్‌తో ఉండవచ్చు. బ్యాక్ ప్యానెల్‌లో కొత్త ఐఫోన్ 17 ఎయిర్‌లో సింగిల్ 48MP రియర్ షూటర్ ఉండవచ్చు. ఐఫోన్ 17లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ 8K వీడియో, 7x జూమ్‌తో ట్రిపుల్-లెన్స్ 48MP కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశాలున్నాయి.
iPhone 17 series
Aluminum frame
glass back design
rear camera lenses
iPhone 17 Pro Max
Scroll for the next article