News15th Apr 09:06 AMSunil Byrisetty1 min read

తెలంగాణ టు ఏపీ.. సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్

ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో పని చేస్తూ వచ్చిన ఆ అధికారులు ఏపీ కేడర్ కాబట్టి ఏపీకి వెళ్లిపోవాలని ఇటీవల క్యా

తెలంగాణ టు ఏపీ.. సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో పని చేస్తూ వచ్చిన ఆ అధికారులు ఏపీ కేడర్ కాబట్టి ఏపీకి వెళ్లిపోవాలని ఇటీవల క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా సీనియర్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేస్తున్నారు. ఐపీఎస్ అంజనీ కుమార్‌కు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ బబాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్ విశ్వజిత్‌ను రిలీవ్ చేశారు. అలాగే అభిలాష బిస్త్‌కు ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం చైల్డ్ కేర్ లీవ్‌లో ఉన్న అభిలాష సెలవు నుంచి వచ్చాక బాధ్యతలు అప్పగిస్తారు.
Postings for two IPS officers in AP
IPS officers
Government gives post
ఐపీఎస్ అంజనీ కుమార్‌
అభిలాష బిస్త్‌
Scroll for the next article