Mobiles6th Jul 11:30 AMSunil Byrisetty1 min read

బిగ్ బ్యాటరీతో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్!

స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పనీ నడవని ప్రస్తుత రోజుల్లో బ్యాటరీ గురించి చింత ఉంటోంది. అందుకే ఐకూ 13 పెద్ద బ్యాటరీతో పాటు బలమైన పనితీరును కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా కొత్త మోడల్‌ను

బిగ్ బ్యాటరీతో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్!
స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పనీ నడవని ప్రస్తుత రోజుల్లో బ్యాటరీ గురించి చింత ఉంటోంది. అందుకే ఐకూ 13 పెద్ద బ్యాటరీతో పాటు బలమైన పనితీరును కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా కొత్త మోడల్‌ను తెచ్చింది. ఇది 6000mAh బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 16GB వరకు ర్యామ్, డేటా యాక్సెస్ కోసం యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. 6.82-ఇంచ్ 2కే ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 144హెచ్జెడ్రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. ఈ డివైజ్‌లో కస్టమ్ కూలింగ్ సిస్టమ్, హీట్‌ను నిర్వహించడానికి- పనితీరును నిర్వహించడానికి ప్రత్యేక గేమింగ్ చిప్ కూడా ఉన్నాయి. ఐకూ 13 ధర 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 54,999 కాగా, 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 59,999.
Smart phones
iQOO 13 mobile
smartphone with a big battery
6000mAh battery
Qualcomm Snapdragon 8 Elite
Scroll for the next article