Mobiles26th May 04:09 PMSunil Byrisetty1 min read
7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ.. ఐక్యూ నియో 10
ఐక్యూ సంస్థ తాజాగా దేశీయంగా నియో 10 స్మార్ట్ఫోన్ని లాంచ్ చేసింది. 7000 ఎంఏహెచ్భారీ బ్యాటరీతో వచ్చే ఐక్యూ నియో 10 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .31,999గా ఉంది. 8
ఐక్యూ సంస్థ తాజాగా దేశీయంగా నియో 10 స్మార్ట్ఫోన్ని లాంచ్ చేసింది. 7000 ఎంఏహెచ్భారీ బ్యాటరీతో వచ్చే ఐక్యూ నియో 10 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .31,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .33,999 అని పేర్కొన్నారు. 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .35,999. టాప్ ఎండ్ 16 జీబీ ర్యామ్ / 5 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .40,999గా ప్రకటించారు. లాంచ్ ఆఫర్ కింద సంస్థ రూ. 2 వేల ఇన్స్టెంట్ డిస్కౌంట్‌ని ఇస్తోంది. ఫలితంగా ఐక్యూ నియో 10 నాలుగు వేరియంట్ల ధరలు వరుసగా రూ.29,999, రూ.31,999, రూ.33,999, రూ.38,999కు చేరాయి. ఐక్యూ నియో 10 స్మార్ట్ఫోన్‌ని అమెజాన్, ఐక్యూ సొంత వెబ్సైట్‌లో జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ నియో 10లో 6.78 ఇంచ్ 144 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ స్మార్ట్ఫోన్కి ఐపీ 65 ప్రొటెక్షన్లభిస్తోంది. ఐక్యూ నియో 10 స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్తో అడ్రినో 825 జీపీయుతో పనిచేస్తుంది. LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ను ఇందులో అందించారు. 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ స్మార్ట్ఫోన్ 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంది. కానీ ఈ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు.