Mobiles25th Jul 04:34 PMSunil Byrisetty1 min read
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ చార్జింగ్
ఐకూ నియో 11S త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మొదట్లో ఈ ఫోన్‌ను జూలై నెలలోనే చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింద
ఐకూ నియో 11S త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మొదట్లో ఈ ఫోన్‌ను జూలై నెలలోనే చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది. అయితే తాజాగా ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని, వేరియంట్లు, లాంచ్ టైమ్‌లైన్, కీలక ఫీచర్ల వివరాలను విబో ద్వారా లీక్ చేశారు. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవబోయేది దీని బ్యాటరీ కెపాసిటీనే. ఈ డివైజ్ ఏకంగా 8,000mAh కొలతలతో కూడిన భారీ బ్యాటరీతో రాబోతోందని లీక్స్ చెబుతున్నాయి. ఇటీవల 3C సర్టిఫికేషన్ సైట్‌లో నమోదైన V2545A మోడల్ నంబర్ డేటా ప్రకారం.. ఇది 100W వేగవంతమైన వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల రోజంతా ఎంత హెవీగా వాడినా బ్యాటరీ అయిపోతుందనే భయం ఉండదు, చార్జింగ్ కూడా కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది.