News8th Jun 11:12 AMSunil Byrisetty1 min read

కొత్త ఐక్యూ Z10 లైట్ వెర్షన్.. సూపర్ ఫీచర్స్

ప్రముఖ మొబైల్ సంస్థ ఐక్యూ ఐక్యూ Z10x సిరీస్ తర్వాత Z10 లైట్ వెర్షన్ తీసుకువస్తోంది. విడుదలైన ఫోన్ టీజర్‌ ప్రకారం ఐక్యూ Z10 లైట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ 5Gతో వస్తుందని తెలుస్తోంది. ఈ

కొత్త ఐక్యూ Z10 లైట్ వెర్షన్.. సూపర్ ఫీచర్స్
ప్రముఖ మొబైల్ సంస్థ ఐక్యూ ఐక్యూ Z10x సిరీస్ తర్వాత Z10 లైట్ వెర్షన్ తీసుకువస్తోంది. విడుదలైన ఫోన్ టీజర్‌ ప్రకారం ఐక్యూ Z10 లైట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ 5Gతో వస్తుందని తెలుస్తోంది. ఈ ఐక్యూ ఫోన్‌లో పిల్-ఆకారపు కెమెరా ఉందని కంపెనీ చెబుతోంది. ఐక్యూ Z10 లైట్ భారత మార్కెట్లో జూన్ 18న ఐక్యూ Z10 లైట్ రాబోతోందని కంపెనీ ప్రకటించింది. ఈ ఐక్యూ ఫోన్ బ్లూ కలర్ వేరియంట్‌లో రాబోతోందని అంచనా. ఈ ఐక్యూ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చని అంచనా. అలాగే 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో ఉండవచ్చని, 6,000mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్‌లతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఐక్యూ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను ఉండొచ్చని, ధర వివరాలను వెల్లడించకపోయినా.. రూ.12 వేల మధ్య ఉంటుందని అంచనా. అమెజాన్‌లో ఈ గ్యాడ్జెట్ అందుబాటులోకి రానుంది.
Mobile
iQOO Z10 Lite
ఐక్యూ Z10 లైట్ లాంచ్
ఐక్యూ Z10 లైట్‌ లాంచ్
HD+ LCD ప్యానెల్‌
ఐక్యూ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా
Scroll for the next article