News26th Jan 03:43 PMSunil Byrisetty1 min read
సివిల్ సర్వీసెస్లో ఐఆర్డీఎస్!
దేశంలో పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముసాయిదాపై రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఐఏఎస్), ఇండియన్ పోలీసు సర్వీసు
దేశంలో పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముసాయిదాపై రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఐఏఎస్), ఇండియన్ పోలీసు సర్వీసు (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (ఐఎఫ్ఎస్) వంటి అఖిల భారత సర్వీసుల మాదిరే త్వరలో ఐఆర్డీఎస్ (ఇండియన్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసు) రానుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం కల్పిం చేందుకు, అత్యుత్తమ సేవలు అందించేందుకు వీలుగా అఖిల భారత గ్రామీణాభివృద్ధి సర్వీసును ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు పలు సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధమైంది. వికసిత్ భారత్-2047 లక్ష్యాల్లో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం పలు లక్ష్యాలను నిర్దేశించింది.