News18th Oct 03:35 PMSunil Byrisetty1 min read

కల్తీ మద్యంపై ఉక్కుపాదం!

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. వైసిపి అసత

కల్తీ మద్యంపై ఉక్కుపాదం!
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. వైసిపి అసత్య ఆరోపణలు చేస్తుందని, గత 5 ఏళ్ళు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఎన్నికల్లో చూశామని గుర్తు చేశారు. మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయని, దీనితో కల్తీ మద్యం పేరిట డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాటి వైసీపీ పాలనలో మద్యంలో సైతం హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈరోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. కల్తీ మద్యంపై ఉక్కు పాదం మోపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Parthasarathi
YSRCP
Liquor Scam
Fake Liquor
Development
Good Governance
TDP
ఏపీ రాజకీయాలు
అభివృద్ధి
మంచి పాలన
టిడిపి
Scroll for the next article