News21st Sep 05:51 PMSunil Byrisetty1 min read
అడ్డగోలుగా డీఎస్సీ ఉద్యోగాలు? సజ్జల ఫైర్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తప్పు చేసి దబాయించాలని చూస్తున్నారని వైసీపీ రాష్ట్రసమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దబాయించడం, బుకాయించడమే కాదు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తప్పు చేసి దబాయించాలని చూస్తున్నారని వైసీపీ రాష్ట్రసమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దబాయించడం, బుకాయించడమే కాదు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. FBI పేరు మీద మెటాకు ఫిర్యాదులు చేయడం ఆశ్చర్యకరమన్నారు. చంద్రబాబుకు కొడుకు తోడయ్యాక ఈ పరిస్థితులు దాపురించాయని వ్యాఖ్యానించారు. డీఎస్సీలో మోసపోయిన వారికి సమాధానం కూడా చెప్పకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఏమాత్రం అర్హత లేని వారిని తీసుకున్నారని అన్యాయం జరిగిన అభ్యర్థులు వచ్చారని తెలిపారు. డీఎస్సీలో పేపర్లు కూడా అమ్ముకున్నారని, సర్టిఫికెట్లు కూడా ఫేక్ అనేది బయటకు వచ్చిందని, టెట్ కూడా పాస్ కానీ వారికి ఉద్యోగం ఇచ్చారని ఆరోపణలు చేశారు. సంబంధం లేని సబ్జెక్టుల్లో ఉద్యోగాలు ఇచ్చారని, ఎకనామిక్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ పత్రాలు కూడా ఫేక్ సృష్టించారని సజ్జల ఆరోపించారు.