News27th Sep 04:48 PMSunil Byrisetty1 min read

కృష్ణా మిల్క్ యూనియన్‌లో అక్రమాలు

కృష్ణా మిల్క్ యూనియన్‌లో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనస

కృష్ణా మిల్క్ యూనియన్‌లో అక్రమాలు
కృష్ణా మిల్క్ యూనియన్‌లో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ మ్యాక్స్ చట్టం ప్రకారం పలు డివిజన్లుగా పనిచేస్తుందని కృష్ణాజిల్లాలో కృష్ణా మిల్క్ యూనియన్ గా సహకార రంగంలో ఉన్నట్లు వివరించారు. కృష్ణా మిల్క్ యూనియన్ దాణా కర్మాగారం నిర్మించేందుకు బాపులపాడు మండలం వీరవల్లి లో పొలం కొనుగోలు చేయగా అక్కడ పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీ నిర్మించారని తెలిపారు. ఇక్కడ భూమి కొనుగోలులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని యార్లగడ్డ సభ దృష్టికి తెచ్చారు. 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు యూనియన్ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తాను పాలపార్టీగా ప్రకటించుకుంటూ వైసిపి నాయకులు, కార్యకర్తలకు కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా పాల బూత్ లు సైతం వైసీపీ వాళ్లకే ఇచ్చారని ఆరోపించారు. వైసిపి వాళ్ళకి పెద్దపీట వేసిన చైర్మన్ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాను టిడిపి అంటూ ప్రకటించుకోవటం శోచనీయమన్నారు.
Andhra Pradesh
Krishna Milk Union
Vijay Dairy
Irregularities
Cooperative Sector
Yarlagadda Venkatarau
Gannavaram
Assembly Sessions
Land Scam
Political influence
TDP
YSRCP
కృష్ణా మిల్క్ యూనియన్‌లో అక్రమాలు
Scroll for the next article