News17th Aug 01:06 PMSunil Byrisetty1 min read
36 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్
రానున్న మూడేళ్లలో అంటే 2029 నాటికల్లా గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని జలవనురుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ గోదావరి డెల్టా లో
రానున్న మూడేళ్లలో అంటే 2029 నాటికల్లా గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని జలవనురుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ గోదావరి డెల్టా లోని కాలువలు డ్రైన్లు ఆధునీకరణ కోసం 14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామన్నారు. డిపిఆర్ కూడా తయారు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులతో చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేసినట్లు చెప్పారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా ఉందన్నారు. 23వేల క్యూసెక్కుల సామర్ద్యం ఉన్న యనమదురు డ్రైన్ కు, సామర్ద్యానికి మించి వరద వస్తోంది. యనమదురు డ్రైన్ సామర్ద్యాన్ని 30వేల క్యూసెక్కులకు పెంచడం, శిధిలావస్ధకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. యనమదురు డ్రైన్ లో 86 ఇన్‌లెట్లకు గానూ 70 ఇన్‌లెట్లు శిధిలావస్ధకు చేరుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు విడతల్లో 3.2 కోట్లు కేటాయించి, 10 ఇన్లెట్ల పునర్నిర్మిస్తున్నామని అన్నారు.