News23rd Jan 05:36 PMSunil Byrisetty1 min read

ప్రపంచ టెక్నాలజీలో ఏపీ 'సూపర్ పవర్' కానుందా?

దావోస్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ జైత్రయాత్ర సాగించింది. ప్రపంచం గర్వించదగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన ఇంటి ముంగిటకే రాబోతోంది. నాలుగో పారిశ్రామిక విప్లవం (4IR) లో ప్రపంచ గమనాన్ని శ

ప్రపంచ టెక్నాలజీలో ఏపీ 'సూపర్ పవర్' కానుందా?
దావోస్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ జైత్రయాత్ర సాగించింది. ప్రపంచం గర్వించదగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన ఇంటి ముంగిటకే రాబోతోంది. నాలుగో పారిశ్రామిక విప్లవం (4IR) లో ప్రపంచ గమనాన్ని శాసించే ఐదు కొత్త కేంద్రాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటిస్తే.. అందులో ఫ్రాన్స్, యూకే, యూఏఈ (రెండు) లాంటి దిగ్గజ దేశాల సరసన మన ఆంధ్రప్రదేశ్ నిలవడం విశేషం. 'C4IR' కేంద్రం కేవలం ఒక కార్యాలయం కాదు.. భవిష్యత్తు నిర్మాణానికి ఒక వంతెన. ఈ కేంద్రం ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారిస్తుంది. సైబర్ రెసిలియెన్స్ & AI: పెరుగుతున్న డిజిటల్ కాలంలో సైబర్ దాడుల నుండి రక్షణ కల్పించడంతో పాటు, కృత్రిమ మేధస్సు (AI) తో పాలనను, వ్యవసాయాన్ని, విద్యను ఎలా విప్లవాత్మకంగా మార్చవచ్చో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్ (హరిత ఇంధనం): రాబోయే రోజుల్లో ఏపీని 'గ్రీన్ ఎనర్జీ హబ్'గా మార్చడమే లక్ష్యం. మన రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ దిశగా ఇది కీలక అడుగుగా మారనుంది.
Andhra Pradesh
Davos
World Economic Forum
Fourth Industrial Revolution
C4IR
Artificial Intelligence
Cyber Resilience
గ్రీన్ ఎనర్జీ
ఎనర్జీ ట్రాన్సిషన్
గ్లోబల్ టెక్నాలజీ హబ్
ఏపీ అభివృద్ధి
Scroll for the next article