News25th Jan 12:25 PMSunil Byrisetty1 min read
జామ చెట్టు ఇంట్లో ఉండొచ్చా?
జామ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవాలని చాలామంది కోరుకుంటారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటి వద్ద ఒక జామ చెట్టు కనిపించడం సాధారణమే. ఈ చెట్లు ఎక్కువ సంరక్షణ అవసరం ల
జామ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవాలని చాలామంది కోరుకుంటారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటి వద్ద ఒక జామ చెట్టు కనిపించడం సాధారణమే. ఈ చెట్లు ఎక్కువ సంరక్షణ అవసరం లేకుండా పెరుగుతాయి. రసాయన ఎరువులు లేకపోయినా మంచి ఫలాలను అందిస్తాయి అనే నమ్మకం కూడా ఉంది. అందుకే ఇంటి అవసరాల కోసం జామ చెట్టు పెంచడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే జామ చెట్టు పెంచడం ఆరోగ్య పరంగా మాత్రమే కాదు వాస్తు శాస్త్రం పరంగా కూడా సరైనదేనా అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది. ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండటం వలన సానుకూలత పెరుగుతుందా లేదా అనే అంశంపై వాస్తు నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తుంటారు. వాటిని పాటిస్తే సమస్యలు రావని అలాగే ఇంట్లో మంచి వాతావరణం కొనసాగుతుందని వారు చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టును ఇంట్లో పెంచుకోవడం తప్పు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అది ఏ దిశలో నాటుతున్నాం అనే అంశమే ముఖ్యమని వారు అంటున్నారు. సరైన స్థలంలో చెట్టు ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.