News19th Nov 10:23 AMSunil Byrisetty1 min read
ఇక నక్సలిజానికి క్లైమాక్స్?
దేశంలో నక్సలిజం చివరి దశకు చేరింది. నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. ఇప్పుడు మావ
దేశంలో నక్సలిజం చివరి దశకు చేరింది. నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను క్లైమాక్స్ కు తీసుకు వచ్చాక… చివరి ఘట్టం ఏపీలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల భావజాలం గురించి పక్కన పెడితే ప్రస్తుత కాలంలో వారి పోరాట విధానమే అసహజం. ఎక్కడ ఉన్నా మనిషిని ఇట్టే కనిపెట్టగలిగే టెక్నాలజీ వచ్చింది. వీరు అడవుల్లోకి వెళ్లినప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో.. ఆ నక్సల్స్ మైదాన ప్రాంతాల్లో యథేచ్చగా తిరిగినా గుర్తు పట్టేవారు ఉండరు. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం బహిరంగం అయిపోయింది. అంతకు మించి భావజాలం బలహీనపడిపోయింది. అంతర్గత సమస్యలతో చీలికలు పేలికలు అయి.. పోలీసులకు సమాచారం ఇచ్చేవారు ఎక్కువయ్యారు. ప్రభుత్వం కూడా నక్సల్స్ సమస్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే లొంగిపోయిన వాళ్లు లొంగిపోగా..మిగిలిన వాళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు లీడర్, క్యాడర్ ఎవరూ లేరు.