News17th Nov 11:50 AMSunil Byrisetty1 min read

రుషికొండ ప్యాలెస్ వారి చేతికేనా!?

విశాఖలోని విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్ ను సద్వినియోగం చేయడంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టూరిజానికే ఆ భవనాన్ని ఉపయోగించాలని ప్రజలు సలహాలు ఇచ్చారు. గతంలో వందక

రుషికొండ ప్యాలెస్ వారి చేతికేనా!?
విశాఖలోని విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్ ను సద్వినియోగం చేయడంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టూరిజానికే ఆ భవనాన్ని ఉపయోగించాలని ప్రజలు సలహాలు ఇచ్చారు. గతంలో వందకుపైగా గదులు ఉండే రిసార్టు ను కూల్చేసి.. ఐదు వందల కోట్లు పెట్టి కేవలం పన్నెండు గదులు ఉండే భవనాలు కట్టారు. దీని వల్ల ఆదాయం కూడా రాదు. అయితే పక్కన తొమ్మిది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. రిసార్టులాగా అయితే మొత్తం వినియోగించుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాలు కాకుండా.. ఇతర నిర్మాణాలతో కాటేజీలుగా మార్చాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్ధ హోటల్స్ నిర్వహణ సంస్థ అట్మాస్పియర్ కోర్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మాల్దీవ్స్ సహా అనేక ప్రముఖ టూరిజం డెస్టినేషన్స్ లో హోటల్స్ ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇటీవల ఇండియాలో విపరీతంగా పెట్టుబడులు పెడుతోంది. విస్తరిస్తోంది. విశాఖలో ఓ మంచి ప్రాజెక్టు కోసం చూస్తోంది. రుషికొండ అయితే సరిపోతుందని భావిస్తోంది. అందుకే ప్రభుత్వ వర్గాలను సంప్రదించిందని.. దానిపై వర్కవుట్ జరుగుతోందని అంటున్నారు.
AP Government
Rushikonda Palace
Visakhapatnam
Tourism development
Atmosphere core
Luxury resorts
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
టూరిజం డెవలప్‌మెంట్
Scroll for the next article