Technology22nd Aug 08:52 AMSunil Byrisetty1 min read

ఉద్యోగులపై టీసీఎస్ నిఘా? ల్యాప్ టాప్స్ ట్రాకింగ్ నిజమా..!

అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో వివాదంలో చిక్కుకుంది. సంస్థ తమ ఉద్యోగుల ల్యాప్ టాప్స్ పై నిఘా పెట్టిందనే ప్రచారం కలకలం రేపింది. ఆన్ లైన్లో ల్యాప్ టా

ఉద్యోగులపై టీసీఎస్ నిఘా? ల్యాప్ టాప్స్ ట్రాకింగ్ నిజమా..!
అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో వివాదంలో చిక్కుకుంది. సంస్థ తమ ఉద్యోగుల ల్యాప్ టాప్స్ పై నిఘా పెట్టిందనే ప్రచారం కలకలం రేపింది. ఆన్ లైన్లో ల్యాప్ టాప్స్ ను ట్రాక్ చేస్తోందన్న ప్రచారంతో టెన్షన్ మొదలైంది. ఉద్యోగులకు ఇచ్చిన ల్యాప్ టాప్స్ లో తాజాగా ప్రత్యేక పర్యవేక్షణ సాఫ్ట్ వేర్ డిజిటల్ యూజర్ ఎక్స్ పీరియన్స్ మానిటరింగ్ టూల్ ను ఇన్ స్టాల్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ల్యాప్ టాప్ లో ఏ యాప్, ఎంతసేపు వాడుతున్నారనేది పసిగట్టేందుకు ఈ టూల్ ఇన్ స్టాల్ చేసినట్లు ఉద్యోగులు చెప్పారు. దీంతో ఉద్యోగుల గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే టీసీఎస్ ఈ అంశంపై స్పందించింది. ఉద్యోగులతోపాటు అందరికీ క్లారిటీ ఇచ్చింది. ల్యాప్ టాప్స్ యాక్టివిటీని పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని తేల్చి చెప్పింది. కానీ నిఘా పెట్టలేదని పేర్కొంది. దీంతో నిఘా నిజమా కాదా అనే చర్చ కొనసాగుతోంది.
TCS News
Tata Consultancy Services
Employee Monitoring
Laptop Tracking
Employee Privacy
Digital User Experience
Monitoring Software
IT Employees
Workplace Surveillance
Technology News
IT Industry
Tata Group
Scroll for the next article